14 రోజుల రోజువారీ కరోనావైరస్ లక్షణాలు
14 రోజుల రోజువారీ కరోనావైరస్ లక్షణాలు ముందురోజు తీవ్రమైన అలసట కలిగినది స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు అలసటగా అనిపించింది తలనొప్పి మొదలైంది నిద్ర కూడా సరిగా పట్టలేదు బాడీలో ఏదో జరుగుతుంది అని అర్థమైంది Day 1: 100.5°F చలితో కూడిన జ్వరం మొదలైంది ఎక్కువగా వొళ్ళు నొప్పులు, విపరీతమైన తలనొప్పి, తీవ్రమైన అలసట , ఆందోళన కలిగింది. టెస్ట్ చేయించుకున్నాను పాజిటివ్ వచ్చినది. డాక్టర్ సూచించిన మందులు తీసుకున్నాను . కుటుంబంలో మిగతా సభ్యులకు, తెలిసిన వాళ్లకు టెస్ట్ చేపించాను వాళ్లందరికీ నెగిటివ్ వచ్చినది. ఊపిరి పీల్చుకున్నాను . Day 2 : చాతిలో నొప్పి మొదలైంది. covid హెల్ప్ లైన్ సెంటర్ కి కాల్ చేసి మాట్లాడిన తర్వాత గ్యాస్ వల్ల నొప్పి వస్తుంది , పరిగడుపున వేసుకునే గ్యాస్ టాబ్లెట్లు మార్చమని చెప్పారు Pantop D వేసుకున్న . Day3 : చాతిలో నొప్పి, జ్వరం , తలనొప్పి పూర్తిగా తగ్గినది.ఇప్పటివరకు నేను నేను భయపడినంత గా కరోనా వల్ల ఇబ్బంది ఏమీ లేదు అని నిర్ధారించుకున్న తరువాత భయం తగ్గినది. ధైర్యం పెరిగినది Day 4 : చాలా రిలాక్స్ గా ఉన్నాను. నార్మల్ గా ఉన్నట్లు గానే ఉంది కానీ కొంచెం అలసట ఉన్నది . ...