14 రోజుల రోజువారీ కరోనావైరస్ లక్షణాలు
14 రోజుల రోజువారీ కరోనావైరస్ లక్షణాలు
ముందురోజు
తీవ్రమైన అలసట కలిగినది స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు అలసటగా అనిపించింది తలనొప్పి
మొదలైంది నిద్ర కూడా సరిగా పట్టలేదు బాడీలో ఏదో జరుగుతుంది అని అర్థమైంది
Day 1: 100.5°F చలితో కూడిన జ్వరం మొదలైంది ఎక్కువగా వొళ్ళు నొప్పులు, విపరీతమైన తలనొప్పి, తీవ్రమైన అలసట ,ఆందోళన కలిగింది.
టెస్ట్ చేయించుకున్నాను పాజిటివ్ వచ్చినది. డాక్టర్ సూచించిన మందులు తీసుకున్నాను. కుటుంబంలో మిగతా సభ్యులకు, తెలిసిన వాళ్లకు
టెస్ట్ చేపించాను వాళ్లందరికీ నెగిటివ్ వచ్చినది. ఊపిరి పీల్చుకున్నాను.
Day 2: చాతిలో నొప్పి మొదలైంది. covid హెల్ప్ లైన్ సెంటర్ కి కాల్ చేసి మాట్లాడిన
తర్వాత గ్యాస్ వల్ల నొప్పి వస్తుంది ,పరిగడుపున
వేసుకునే గ్యాస్ టాబ్లెట్లు మార్చమని చెప్పారు Pantop D వేసుకున్న.
Day3: చాతిలో నొప్పి, జ్వరం,తలనొప్పి పూర్తిగా తగ్గినది.ఇప్పటివరకు నేను నేను
భయపడినంత గా కరోనా వల్ల ఇబ్బంది ఏమీ లేదు అని నిర్ధారించుకున్న తరువాత భయం తగ్గినది.
ధైర్యం పెరిగినది
Day 4: చాలా రిలాక్స్ గా ఉన్నాను.
నార్మల్ గా ఉన్నట్లు గానే ఉంది కానీ కొంచెం అలసట ఉన్నది. పారాసిటమాల్ వాడటం మానేసాను.
Day5: ఆయాసం పెరిగినట్లుగా ఉంది
గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉన్నట్లు అనిపించింది వెంటనే కాల్ సెంటర్ కు కాల్
చేస్తే కొన్ని ఇతర మందులు (Doxt-SL, Medrol 8mg, Eliquis 2.5mg ) 5 రోజుల పాటు వేసుకోమని చెప్పారు
మొదటి రోజు నుండి
వాడుతున్నా యాంటిబయాటిక్ కోర్స్ పూర్తయినది
Day 6: డాక్టర్ ముందురోజు
సూచించిన మందులు వాడటం మొదలుపెట్టాను. మొదటి రోజు
నుండి లేని దగ్గు ఆరవ రోజున మొదలైంది. నిద్ర సరిగా
పట్టలేదు.
Day 7: ఆయాసం చాలా వరకు తగ్గిపోయింది.
దగ్గు ఎక్కువ అయినది. కాల్ సెంటర్ తో
మాట్లాడిన తర్వాత దగ్గు కోసం Ascoril సూచించారు.
Day 8: మూడు రోజుల నుండి
వేసుకుంటున్న మందుల వలన ఆయాసం పూర్తిగా తగ్గినప్పటికి డాక్టర్ సూచన మేరకు ఐదు
రోజులు వాడాను.
Day 9: దగ్గు తీవ్రత కొంచెం
తగ్గినది.
Day 10: ఎటువంటి ఇబ్బంది లేదు
కానీ అప్పుడప్పుడు దగ్గు వస్తుంది.
Day11: ఎటువంటి ఇబ్బంది లేదు
వాకింగ్ స్టార్ట్ చేశాను
Day12: ఎటువంటి ఇబ్బంది లేదు
రోజుకి మూడు నాలుగు సార్లు మాత్రమే దగ్గు వచ్చినది
Day 13: నార్మల్ గా ఉన్నాను అన్న
ఫీలింగ్ కలిగింది. దగ్గు కొంచం తగ్గినది
Day14: టెస్ట్ చేయించుకున్నాను
నెగిటివ్ వచ్చినది.
తరువాత మూడు
రోజులపాటు ఇంట్లోనే జాగ్రత్తగా ఉన్నాను.
నావిన్నపం: కరోనా కి ఎవరు భయపడాల్సిన పని ఏమీ లేదు
డాక్టర్ సూచించిన మందులు వాడితే సరిపోతుంది. మన వల్ల వేరే వాళ్ళు ఇన్ఫెక్ట్
అవ్వకుండా చూసుకోవడం మన బాధ్యత.
ప్రతిరోజు sanitizer చేసుకున్నాను విధిగా మాస్క్ వాడను నాకు కరోనా రాదు అని అనుకోవడం పొరపాటు అవుతుంది .
మనం కొన్ని దారులను ముసినప్పటికీ వేరే
మార్గాలలో మనం ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు అని అనుకోవడం మంచిది.
(ఇది నా
వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)